సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సర్కార్ వారి పాట సినిమా ఎంత పెద్ద విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించిందో మన అందరికీ తెలిసిందే. భరత్ అనే నేను , మహర్షి,  సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో సర్కారు వారి పాట మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

అలా భారీ అంచనాల నడుమ మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాలో  వింటేజ్ మహేష్ బాబు ను గుర్తుకు తెచ్చే విధంగా మూవీ ఉండటంతో పాటు ఈ సినిమాలో ఒక మంచి కథ ఉండటంతో సర్కార్ వారి పాట మూవీ కి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించింది. అలా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇలా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసిన సర్కారు వారి పాట సినిమా కొన్ని రోజుల క్రితం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాక పోతే ఇన్ని రోజుల పాటు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంటేడ్ పద్దతిలో అందుబాటులో ఉంది. ఇన్ని రోజుల పాటు రెంటేడ్ పద్దతిలో అందుబాటులో ఉన్న సర్కారు వారి పాట సినిమా ఈ రోజు నుండి అమెజాన్  ప్రైమ్ వీడియో లో సబ్ స్క్రిప్షన్ ఉన్న వారి అందరికీ ఫ్రీ గా చూసే వెసులుబాటును కల్పించింది.

ఎవరైనా అమెజాన్ సబ్ స్క్రిప్షన్  ఉన్న వారు సర్కారు వారి పాట సినిమాలు చూడాలి అంటే ఈ రోజు నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగా చూడవచ్చు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా , పరుశురామ్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: