గత శుక్రువారం విడుదలైన 8 చిన్న సినిమాలు ఫ్లాప్ గా మారాయి. ఎంతోకొంత ‘సమ్మతమే’ మూవీకి ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీనితో చిన్న సినిమాలకు ప్రేక్షకులు ఉండరా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పూరీజగన్నాథ్ కొడుకు ‘చోర్ బజార్’ మూవీ కూడ ఫ్లాప్ కావడంతో అతడిని వరస ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి.


ఇలాంటి పరిస్థుతులలో ఈవారం విడుదల కాబోతున్న గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ మూవీకి రోజులు కలిసివస్తున్నాయా అన్న సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమాతో పోటీగా వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగ’ విడుదల కావలసి ఉన్నప్పటికీ ఈమూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో గోపీచంద్ మూవీకి సోలో మొనోపలి దక్కింది. సాధారణంగా చిన్న సినిమాలకు ఇలాంటి అవకాశం దక్కదు.


‘ప్రతిరోజు పండగే’ మూవీ విడుదల తరువాత దర్శకుడు మారుతి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈమూవీ పై మారుతి చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీ విజయవంతం అయితే మారుతికి ప్రభాస్ తో సినిమా తీసే అవకాశం ఖరార్ కావచ్చు. ఎప్పటి నుంచో టాప్ హీరోలతో సినిమాలు తీయాలి అని కలలు కంటున్న మారుతి కోరిక తీరాలి అంటే ‘పక్కా కమర్షియల్’ పక్కాగా హిట్ అవ్వాలి.


వాస్తవానికి నేటి యువత తాము చాల కమర్షియల్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకుని మారుతి సహజసిద్ధమైన కామెడీ టచ్ తో ఈమూవీ కథను అల్లారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు పెరిగాయి. గోపీచంద్ కు హిట్ వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. అతడి తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఎందరో హీరోలు వరసగా హిట్స్ కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కనీసం ఈసినిమా కూడ హిట్ కాకపోతే గోపీచంద్ కెరియర్ ఇంకా డేంజర్ లో పడుతుంది..మరింత సమాచారం తెలుసుకోండి: