మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి..తనదైన  యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ బడా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే rrr (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.ఇక  ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో చేస్తున్నాడు. 

పోతే కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలెట్టేశారు. ఇక అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ఈ సినిమా.. ఆరంభంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి దృష్టినీ తిప్పుకున్న విషయం తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. అయితే క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్‌ను హై లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట.పోతే  ఈ ఎపిసోడ్‌లో బ్లాస్టింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట.ఇక  అందుకే దీనికి ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది.అయితే  ఈ ఒక్క పార్ట్ కోసమే దాదాపు రూ. 20 కోట్లు కేటాయించారని ఓ న్యూస్ లీకైంది. ఇక ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు పాటు ఉండబోతుందని అంటున్నారు.

ఒక్కో నిమిషానికి ఒక్కో కోటి అన్నట్లుగా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకున్నారు.కాగా  ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతైనా శంకర్ సినిమా కదా.. ఇక ఆ మాత్రం బడ్జెట్ ఉండడం ఆశ్చర్యం కాదులే అని జనాలు అనుకుంటున్నారు.ఇకపోతే శంకర్ గత చిత్రాల మాదిరిగానే పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. పోతే ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.అంతేకాదు  అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక  శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.పోతే  ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: