తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ `RRR`.ఇక ఈ సినిమాలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంలచనాలు సృష్టించింది.ఇకపోతే అల్లూరి సీతారామరాజు కొమురం బీం ల ఫిక్షనల్ స్టోరీగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు.ఇక  గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఇదిలావుంటే `RRR` తరువాత ఎన్టీఆర్ వెంటనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ తో తన 30వ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. 

అయితే కానీ స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని అంతే కాకుండా మరో రెండు నెలల పాటు మంచి ముహూర్తాలు లేకపోవడం కూడా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.అయితే ఇక ఎన్టీఆర్ ప్లాన్ ప్రకారం ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ లో సెట్స్ పైకి రావాల్సి వుంది. అదీ జరగలేదు.కాగా  కొరటాల శివ `ఆచార్య` పనుల్లో బిజీగా వుండటం వల్ల సాధ్యపడలేదు.  ఇటీవల డైలాగ్ మోషన్ టీజర్ ని విడుదల చేసిన తరువాత అయినా అంటూ జూలైలో అయినా ముహూర్తం జరిపి రెగ్యులర్ షూటింగ్ కి వెళతారని ప్రచారం జరిగింది.

అయితే  తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఈ నేపథ్యంలో మేకోవర్ కోసం భారీగా తగ్గబోతున్నారట.ఇక  ఇందు కోసం ప్రత్యేకంగా వర్కవుట్ లు మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. కాగా రెగ్యులర్ షూటింగ్ కు దాదాపు రెండు నెలల సమయం వుండటంతో మేకోవర్ కోసం భారీ స్థాయలో కసరత్తులు చేయబోతున్నారట.అయితే 8 నుంచి 9 కిలోల వరకు ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం తగ్గబోతున్నారని తెలిసింది.అంతేకాదు  ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైతే ఈ మూవీని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు వున్నాయని చెబుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: