రొమాంటిక్ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బ్యూటీ కేతిక శర్మ. అంతకుముందే సోషల్ మీడియాలో తన అందచందాలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మోడల్ గా సినిమా రంగంలోకి ప్రవేశించి అందరిని ఆకట్టుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలోకి రావాలని ఎప్పటినుంచో ఆలోచనలు చేస్తున్న కేతీక చివరకు పూరి జగన్నాథ్ ఆమె టాలెంటును గుర్తించి ఆయన తనయుడు ఆకాశ పూరీ సరసన నటింప చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అలా రొమాంటిక్ సినిమాలో వీరు కలిసిన నటించగా అది భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో వెరైటీగా ఉండడంతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసింది అనే చెప్పాలి. తాజాగా ఆమె వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రంగ రంగా వైభవంగా సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక సినిమా అవకాశం ఆమెకు వచ్చిందని వార్త సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ హీరోలుగా నటిస్తున్న తమిళ సినిమా రీమేక్ లో ఈ ముద్దుగుమ్మకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. 

త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఈ ఢిల్లీ భామ ఎంపిక అయిందట. మరి పరస రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ వినోదాత్మకమైన సినిమాలో ఎలాంటి పాత్రలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు తప్పకుండా టాప్ స్టార్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రం మాత్రమే కాకుండా మరింత మంది యువ హీరోలు ఆమెను తమ సినిమాలలో పెట్టుకునేందుకు ఆసక్తిని కన పరుస్తున్నారు. ఇలాంటి విజయమే కొనసాగితే మాత్రం ఈమె తప్పకుండా అగ్ర హీరోల సరసన నటించే హీరోయిన్ గా కూడా మారుతుంది అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: