టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాగచైతన్య తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య 2018 వ సంవత్సరంలో విడుదల అయిన సవ్యసాచి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇలా సవ్యసాచి మూవీతో ఫ్లాప్ మూవీ ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత మజిలీ సినిమాలో హీరోగా నటించాడు.

మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. వెంకీ మామ సినిమా తర్వాత నాగ చైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి బంగార్రాజు మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇలా వరుసగా నాలుగు విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశికన్నా హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలా నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సాధించిన రేంజ్ కలెక్షన్లను అందుకోవడం లేదు. ప్రస్తుతం థాంక్యూ మూవీకి వస్తున్న కలెక్షన్ లను  గమనిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా హిట్ అయ్యే పరిస్థితులు కనబడడం లేదు. దానితో వరుసగా నాలుగు విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న నాగచైతన్య కు థాంక్యూ సినిమా ఆ వరుస విజయాలకు బ్రేక్ వేసేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: