మలయాళం సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే తెలుగు లో  ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ లో ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు .  

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన విక్రమ్ సినిమాలో కూడా అదిరిపోయే పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాతో కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు . అలాగే మలయాళంలో ఫహాద్ ఫాజిల్ నటించిన అనేక మూవీ లు కూడా తెలుగు లోకి డబ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకున్నాయి . ఇది ఇలా ఉంటే ఫహాద్ ఫాజిల్ తాజాగా నటించిన మరో మలయాళ సినిమా కూడా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. పోయిన సంవత్సరం ఫహాద్ ఫాజిల్ , మహేష్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాలిక్ అనే సినిమాలో హీరోగా నటించాడు. పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించింది.

ఇలా మలయాళ ఇండస్ట్రీలో మంచి విజయం సాధించిన మాలిక్ సినిమాను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఆగస్ట్ 12 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆహా నిర్వహణ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: