గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ఎప్పుడో పూర్తయినప్పటికీ ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని విడుదల పనులను మొదలు పెట్టకపోవడం సమంత అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. విడాకుల తర్వాత ఆమె చేపట్టిన మొట్ట మొదటి సినిమా కావడంతో ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సమంత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న ఈ సినిమా అంతకంతకి విడుదల ఆలస్యం కావడం నిజంగా వారిని తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది.

 ఇదే సమయం లో ఈ సినిమా అసలు ఎందుకు ఆగిపోయింది అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. సోషల్ మీడియా వేదికగా సమంత అభిమానులు ఈ చిత్రం విడుదల ఎందుకు ఆపేశారు అనే విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ దీనిపట్ల ఎవరు స్పందించకపోవడం నిజంగా మరెన్నో అనుమానాలను కలిగిస్తుందని చెప్పవచ్చు. భారీ సినిమాలకు భారీ సెట్స్ కు పెట్టింది పేరైన గుణశేఖర్ ఇటీవల కాలంలో ఫామ్ లో లేక ఎన్నో తంటాలు పడుతున్నాడు. ఒక విజయం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. 

అయినా కూడా సక్సెస్ ఆయన దరి చేరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మంచి కం బ్యాక్ చేయాలని భావించిన గుణశేఖర్ కు ఇది కూడా నిరాశనే ఏర్పరుస్తుంది. పలు ఆర్థిక కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయిందని చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ చిత్రానికి ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు ఎదురవుతున్నాయో తెలియదు కానీ ఈ సినిమాను ఏదో ఒక రకంగా విడుదల చేస్తే సమంతకు ఉన్న క్రేజ్ ను బట్టి మంచి కలెక్షన్లు సాధించడం ఖాయం అని వారు చెబుతున్నారు. ఇకపోతే సమంత నటిస్తున్న మరికొన్ని సినిమాలను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఒక పెద్ద హీరో సరసన కూడా ఆమె హీరోయిన్ గా చేస్తూ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: