డీజే టిల్లు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. జొన్నలగడ్డ సిద్దుకు సమానమైన పాత్రలో నటించి ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో ఎక్కువ శాతం చీర కట్టులో ఉన్న ఈ ముద్దుగుమ్మ అందం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో రాధిక అంటూ పిలిచే పిలుపు కూడా బాగా పాపులర్ అయింది. ఇక అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు ఎక్కువగా ఈమెను నేహా శెట్టి కి బదులుగా రాధిక అని పిలుస్తూ ఉన్నారు.తాజాగా తన ఫోటోలు షేర్ చేసిన ఫోటోలను నేటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో కొంతమంది నేటిజన్స్ ఏంటి రాధిక అందాల ఆరబోత యువతను చంపేసేలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కాస్త గ్యాప్ ఇచ్చి ఇలాంటి ఫోటోలను షేర్ చెయ్యి అంటూ తెలియజేస్తున్నారు.డీజే టిల్లు తరువాత ఈ అమ్మడు వరుస సినిమాలతో చాలా బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది అని చెప్పవచ్చు.ఇక ఇలాంటి సమయంలో కాస్త అటు ఇటు అయినా కూడా తన కెరియర్ చాలా ఇబ్బందులు పడుతుంది అని అందుచేతనే నేహా శెట్టి కాస్త మెల్లగా సినిమాలు చేయాలని ఉద్దేశంతోనే ఉన్నట్లుగా సమాచారం. హీరోయిన్ గా వర్ష సినిమాలు చేయడం కంటే మంచి కథ దొరికినప్పుడు మంచి సినిమాలు చేయాలని ఉద్దేశంతోనే ఈ అమ్మడు ఉన్నది. అందుచేతనే అవకాశం వచ్చిన ప్రతి ఆఫర్ ను ఓకే చెప్పకుండా ఉన్నది.
 అయితే ప్రస్తుతానికి డీజే టిల్లు-2 సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నేహా శెట్టి  ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: