టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాలలో అభిమానులు గ్రాండ్ గా జరుపుకున్నారూ.అయితే మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి 200కు పైగా థియేటర్లలో ప్రదర్శితం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు  మహేష్ బాబు సెంటిమెంట్ థియేటర్ అయిన సుదర్శన్ 35 ఎం.ఎంలో పోకిరి సినిమాను ప్రదర్శించాలని మహేష్ ఫ్యాన్స్ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని బోగట్టా.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈ థియేటర్ లో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ప్రదర్శితమవుతోంది. 

అయితే బింబిసార సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.ఇకపోతే  మరోవైపు మహేష్ పుట్టినరోజునే మొహర్రం పండుగ కావడంతో బింబిసార సినిమాకు పండుగ రోజున కూడా బాగా కలెక్షన్లు వచ్చాయి.ఇక  అందువల్ల థియేటర్ యజమానులు మహేష్ ఫ్యాన్స్ కోరినా పోకిరి సినిమాను ప్రదర్శించలేమని వెల్లడించారని తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక మరోవైపు బింబిసార ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే బింబిసార1 సక్సెస్ తో బింబిసార2 బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడకూడదని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. అంతేకాదు  బింబిసార క్రూరమైన రాజుగా ఏ విధంగా మారాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇదిలావుంటే ఇక బింబిసార2 స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కావడంతో వశిష్ట ఈ సినిమా షూటింగ్ ను వేగంగానే పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉంది.  అయితే వచ్చే ఏడాది ఆగష్టు నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఇకపోతే  50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే  కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో తొందరపడకుండా తనకు సక్సెస్ దక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: