యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.

మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా, రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇలా చిత్ర బృందం ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించేది ఫలానా హీరోయిన్ అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 30 వ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఈ ముద్దుగుమ్మే అంటూ మరొక హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెలితే...  తాజాగా విడుదల అయిన సీతా రామం  మూవీ తో అద్భుతమైన విజయాన్ని మరియు అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్న మృణాళిని ఠాకూర్ , ఎన్టీఆర్ 30 వ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: