టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రైటర్ గా `శంఖం` సినిమాతో కెరీర్ ప్రారంభించారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఆ తరువాత `పటాస్`తో డైరెక్టర్ అయ్యారు. ఈ మూవీ నుంచే అనిల్ రావిపూడి - దిల్ రాజుల మధ్య మంచి అనుబంధం మొదలైంది.అయితే `పటాస్`ని దిల్ రాజు నిర్మించకపోయినా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేశారు.ఇక  అదే అనుబంధంతో అనిల్ కు `సుప్రీమ్`ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. కాగా అక్కడి నుంచి అనిల్ రావిపూడి బయటి నిర్మాతకు సినిమా చేయలేదు.ఇదిలావుంటే అనిల్ - దిల్ రాజుల కాంబినేషన్ లో `సుప్రీమ్` నుంచి `ఎఫ్ 3` వరకు ఐదు సినిమాలొచ్చాయి. పోతే మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` మూవీకి 

అనిల్ సుంకర నిర్మాత అయినా అనిల్ కోసం అనిల్ సుంకర కోసం ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించి ఈ మూవీని బన్నీ మూవీ `అల వైకుంఠపురములో`తో పోటీ వున్నా సేఫ్ గా రిలీజ్ చేశారు. అంటే ..ఇక `పటాస్` నుంచి `ఎఫ్ 3` వరకు అనిల్ - దిల్ రాజుల అనుబంధం ప్రతి సినిమా విషయంలోనూ కొనసాగుతూ వచ్చింది.అయితే అనిల్ సినిమాలకు ప్రత్యక్షంగా కొన్ని సార్లు పరోక్షంగా దిల్ రాజు భాగస్వామి అవుతూ వచ్చారు.ఇకపోతే  కానీ తొలిసారి దిల్ రాజు అసోసియేట్ కాకుండానే అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది.కాగా  బాలయ్యతో ఆయన 108వ ప్రాజెక్ట్ గా అనిల్ రావిపూడి ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే  ఈ భారీ ప్రాజెక్ట్ ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి. హరీష్ పెద్ది నిర్మించబోతున్నారు.ఈ ప్రాజెక్ట్ కి వీరిద్దరు ప్రొడ్యూసర్స్ అయినా దిల్ రాజు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా చేరాలని ప్లాన్ చేశారట. అయితే  ఇక దొరక్క దొరక్క దొరికిన పెద్ద హీరో ప్రాజెక్ట్ కావడం తమని ఎక్కడ దిల్ రాజు డామినేట్ చేసేస్తాడోనని షైన్ స్క్రీన్స్ వారే తెలివిగా దిల్ రాజుని పక్కకు తప్పించారని అయినా సరే అనిల్ - బాలయ్య 108 ప్రాజెక్ట్ లో తానూ వుండాల్సిందేనని చివరి నిమిషం వరకు దిల్ రాజు తీవ్రంగా ట్రై చేశారట. అయితే ఇక అంతే కాకుండా బాలయ్యతో ఇంత వరకు సినిమా చేయలేదన్న లోటు కూడా ఈ మూవీతో తీరిపోతుందని ప్లాన్ చేశాడట.. కానీ అదివర్కవుట్ కాలేదని నిర్మాతలే పడనీయలేదని ఇన్ సైడ్ న్యూస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: