తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో కలిసి చేసే అల్లరి గురించి మనందరికీ తెలిసిందే.కరోనా సమయంలో టిక్ టాక్ వీడియోలు తీస్తూ ఇంకా డాన్సులు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే సురేఖ వాణి ఈ వయసులో కూడా తన కూతురితో పాటు సమానంగా డాన్సులు వేస్తూ అందాలను ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ వీడియోలు ఫోటోలను చూసిన సురేఖ వాణి కూతురు కంటే సురేఖ వాణి చాలా బాగుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సురేఖ వాణి ఇంకా సుప్రీత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు.ఇంకా ఈ క్రమంలోనే అప్పుడప్పుడు వారిద్దరిపై ట్రోలింగ్స్ చేసేవారికి తమదైన శైలితో సమాధానం ఇస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నటిగా నిలదుకుపోవాలని ప్రయత్నిస్తోంది.ఇక ఇదిలా ఉంటే  సురేఖ వాణి ఇంకా సుప్రీత లను యూట్యూబ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ క్రమంలోనే నిఖిల్ చిన్నచిన్నగా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేశాడు. నిఖిల్ అడిగిన ప్రశ్నలకు ఆ ఇద్దరు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు.


ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగా నిఖిల్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో తెగ అవుతోంది.త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?అంటూ నిఖిల్‌ ప్రశ్నించగా ఇక అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా.. సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డుని చూపించింది. ఇక అంతేకాకుండా చేసేద్దాం సింగిల్‌ గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్‌ కూడా చేసింది సుప్రిత. కానీ ఆ విషయం పై స్పందించిన సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నిఖిల్ బాయ్ ఫ్రెండ్‌ విషయంలో మరో ప్రశ్న కూడా అడిగాడు. మీరిద్దరూ సింగిలేనా? అంటూ తల్లీ కుమార్తెలను అతను ప్రశ్నించగా.. ఇద్దరూ కూడా అవునని చెప్పారు. ఇక ఎలాంటి బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని కోరగా.. నన్ను భరిస్తే చాలంటూ కూతురు సుప్రిత సమాధానం చెప్పగా,తల్లి సురేఖా మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్‌ క్వాలిటీస్‌ రివీల్‌ చేసింది. 6 ఫీట్‌ హైట్‌ ఉండాలి, మంచి కలర్‌, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి అలాగే లైట్‌ గా గడ్డం ఉండాలి అంటూ ఇలా తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: