లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈమె కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.అంతేకాదు ఏ రోజు కూడా డబ్బుకు ఆశపడి ఏది పడితే ఆ పాత్ర చేసిన సందర్భాలు లేవు.. ముఖ్యంగా తనకు పాత్ర నచ్చి.. ఆ సినిమా ద్వారా తనకు తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటేనే సినిమాలలో అవకాశాలను అంగీకరిస్తుంది.అయితే  లేకపోతే కోట్లు కుమ్మరించినా సరే ఆ పాత్ర చేయనని ముఖం మీద చెప్పడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.ఇకపోతే  సాంప్రదాయానికి తోబుట్టువుగా ఉండే సాయి పల్లవి ఏ రోజు కూడా గ్లామర్ షో చేసింది లేదు.

అంతేకాదు  స్కిన్ షో అసలే దూరం.. పద్ధతిగా వుండే పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.పోతే అందరి హీరోలతో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉండే సాయి పల్లవి.. విజయ్ దేవరకొండ తో సినిమా అనగానే ససేమిరా అంటూ మొహం మీద తెగేసి చెప్పేసింది.. అయితే ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక ఈయన క్రేజ్ మామూలుగా లేదు.అయితే  ముఖ్యంగా హీరోయిన్ల మొదటి క్రష్ మారిన విజయ్ దేవరకొండ.. ఈయన ఫోటోను టాటుగా వేయించుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఈయన తో నటించాలని ఉవ్విల్లూరుతున్నారు.

ఇక  అంతేకాదు విజయ్ దేవరకొండ తమ క్రష్ అని, డేటింగ్ కూడా చేస్తామని కూడా తెలుపుతూ ఉండడం గమనార్హం.ఇదిలా వుండగా ఇలాంటి సమయంలోనే సాయి పల్లవి విజయ్ దేవరకొండ తో నటించే ప్రసక్తే లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే డియర్ కామ్రేడ్ సినిమాలో ముందుగా సాయి పల్లవికి అవకాశం వస్తే అందులో ముద్ద సీను ఉండడంతో ఆమె రిజెక్ట్ చేసింది. ఇకపోతే విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయం చాలా భిన్నంగా ఉంటుందని భవిష్యత్తులో కూడా అతనితో నటించే ప్రసక్తి లేదు అని చెప్పి ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా విజయ్ దేవరకొండ సినిమాలలో ఎక్కువగా ముద్దు సీన్లు, రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయి పల్లవి రిజెక్ట్ చేసినట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: