హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాలిని  ఠాకూర్ హీరోయిన్ గా సీతా రామం అనే ప్రేమ కథ చిత్రం తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , తరుణ్ భాస్కర్ , భూమిక చావ్లా , సుమంత్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. మరి కొన్ని పాత్రలలో వెన్నెల కిషోర్ , మురళి శర్మ , ప్రియదర్శిమూవీ లో నటించారు. ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయినా సీతా రామం మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

ఇప్పటి వరకు ఈ మూవీ 12 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 12 రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.నైజాం : 6.33 కోట్లు , సీడెడ్ : 1.50 కోట్లు , యూ ఏ : 2.43 కోట్లు , ఈస్ట్ : 1.37 కోట్లు , వెస్ట్ : 92 లక్షలు , గుంటూర్ : 1.08 కోట్లు , కృష్ణ : 1.27 కోట్లు , నెల్లూర్ : 62 లక్షలు . 12 ఈ రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 15.52 కోట్ల షేర్ , 27.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్  ఇండియా లో : 1.74 కోట్లు .ఇతర భాషలలో : 4.80 కోట్లు . ఓవర్ సీస్ లో .5.50 కోట్లు . 12 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 27.61 కోట్ల షేర్ , 54.35 కోట్ల క్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: