యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ 2 కు ముందు వరకు ఈ సినిమాపై ఓ అంచనాలు ఉన్నాయి.
కాని కేజీఎఫ్ 2 విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా నే వసూళ్లు చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఎన్టీఆర్ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా టీం పోస్టర్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ ఊర మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ విడుదల అయ్యింది. దీంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు.

ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే, ఈ సినిమా పై తారక్ ఫాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

సినిమా ఓ పీరియాడిక్ డ్రామా అని, ఈ సినిమాలో హీరో - విలన్ రెండూ ఎన్టీఆరే అని.. అనగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌ 31 ను ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ పై ప్రశాంత్‌ నీల్‌ ఫోటో షూట్‌ టెస్ట్‌ షూట్‌ నిర్వహించాడు. ఈ పోస్టర్ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 32 కెమెరాలు ఉపయోగించాడని సమాచారం. అయితే సినిమా ప్రారంభంకు కనీసం ఇంకా ఆరు నెలల సమయం ఉంది.
ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సాలార్‌ మూవీతో బీజీగా ప్రశాంత్‌ నీల్‌... వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ మూవీ చేయనున్నారు.

ఈ సినిమాకు మంచి పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఆ టైటిల్ కూడా 'అసుర' లేక 'అసురుడు' అని వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.

ఎన్టీఆర్‌ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ 31 చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు పెంచేసింది. ప్రశాంత్ ప్రస్తుతం ప్ప్రభాస్ తో సలార్ యాక్షన్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: