ఏకంగా 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ హీరోగా రూపొందిన మూవీ 'ఊర్వశివో రాక్షసివో'. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతిరోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి హిట్స్ అందించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందుతుంది.'విజేత' వంటి మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది.అను ఇమ్మాన్యూల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కోవిడ్ కారణంగా రిలీజ్ ఆలస్యమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.తాజాగా 'ఊర్వశివో రాక్షసివో' చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పక్కా యూత్ ఫుల్ కంటెంట్ తో ఈ చిత్రం రూపొందినట్లు టీజర్ హింట్ ఇచ్చింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ అలాగే బీభత్సమైన రొమాన్స్ ఈ టీజర్ కు హైలెట్ అని చెప్పాలి.


లిప్ లాక్ సన్నివేశాలు ఇంకా ఇంటిమేట్ సన్నివేశాలు ఈ మూవీలో ఓ రేంజ్లో ఉంటాయనడానికి టీజర్ సాంపుల్ అని చెప్పవచ్చు.టీజర్ లోని కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా ఆకర్షిస్తాయి.అంతర్లీనంగా ప్రేమకి ఇంకా అలాగే స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఈ చిత్రం ద్వారా కొత్తగా చెప్పబోతున్నట్టు తెలుస్తుంది.ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండే ఈ చిత్రం యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఇక టీజర్ తో అంచనాలను పెంచిందనే చెప్పొచ్చు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించగా విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహరించారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. నవంబర్ 4న ఈ మూవీ విడుదల కాబోతుంది. టీజర్ కూడా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది.కానీ సినిమా టీజర్ చూసి ఈ సినిమా హిట్టో ఫట్టో చెప్పలేము. బోల్డ్ కంటెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యిద్ది కానీ సినిమాలో మ్యాటర్ ఉంటే కానీ హిట్ కాదు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: