టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. విజయ్ సేతుపతి ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

స్వయంకృషితో కెరీర్ పరంగా ఊహించని రేంజ్ కు ఎదిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు కావడం గమనార్హం. అయితే విజయ్ సేతుపతి కి మద్యం అలవాటు కావడం వెనుక షాకింగ్ రీజన్ ఉందట..

విజయ్ సేతుపతి ఒక సందర్భం లో మాట్లాడుతూ నేను ఇంటర్ సెకండియర్ చదివే సమయంలో నాకు చదువు ఎక్కలేదని ఆ సమయంలో మార్కులు కూడా పెద్దగా రాలేదని విజయ్ సేతుపతి అన్నారు. మూడు కాలేజీలకు సీటు దరఖాస్తు చేస్తే మూడు కాలేజీల లో ఏ ఒక్క కాలేజీలో సీటు రాలేదని విజయ్ సేతుపతి వెల్లడించారట.. ఆ సమయం లో ఇంటికి వెళ్తే నాన్న మద్యం సేవించారని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారట..

ఆ తర్వాత నాకు కూడా మద్యం అలవాటైందని విజయ్ సేతుపతి తెలిపారు.

  తాను మద్యానికి అలవాటు పడినంత మాత్రా న అదేదో గొప్ప పని అని భావించవద్దని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. లైఫ్ లో సెటిల్ కావాల్సిన టైమ్ లో టైమ్ పాస్ పనులు చేయొద్దని విజయ్ సేతుపతి సూచనలు కూడా చేశారు. స్వేచ్ఛ అనే ముసుగులో మనం బ్రతుకుతున్నామ ని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
  లైఫ్ లో ఎంపిక చేసుకున్న రంగం లో సక్సెస్ సాధించినప్పుడు యువత పిచ్చిపిచ్చి పనులకు దూరంగా ఉండాలని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో మరి చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటా రో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: