పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుండగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది మే 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ ఏడాది అదే తేదీన విడుదలైన సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.


సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా హరిహర వీరమల్లు సినిమా కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయట.. హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తైన తర్వాతే పవన్ ఇతర సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఒక విధంగా క్రిష్ కెరీర్ ను డిసైడ్ చేయనుందని తెలుస్తుంది.


 


సినిమా సక్సెస్ సాధిస్తేనే క్రిష్ కు స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్రిష్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రిష్ గత సినిమా కొండపొలంకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించలేదనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్సినిమా కోసం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.


 


పవన్ హరిహర వీరమల్లు కోసం లుక్ మార్చుకోవాల్సి ఉండటంతో ఈ సినిమా పూర్తయ్యే వరకు పవన్ మరో సినిమాలో నటించే అవకాశం లేదట. కెరీర్ విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ లేదనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: