సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అన్నది ఎప్పటినుంచో వినిపించే మాట  ఇక మీటు ఉద్యమం ద్వారా ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కాస్త మరింత ప్రకంపనలు సృష్టించింది అని చెప్పాలి. అవకాశాలు రావాలి అంటే దర్శక నిర్మాతలకు హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నది ఈ క్యాస్టింగ్ కౌచ్ కి అసలు అర్థం. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటే ఇప్పటికే ఎంతోమంది నటీమణులు కూడా  తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు.


 ఇప్పటికీ కూడా ఎప్పుడు ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా సల్మాన్ ఖాన్ లో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తున్నప్పటి నుంచి ఆ సెన్సాఫ్ హ్యూమర్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తనదైన శైలిలో క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్లు చేశాడు సల్మాన్ ఖాన్. ముంబైలో జరిగిన గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పై కొన్ని సరదా పంచులు వేశాడు.


 చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది తప్పు. ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను చిరంజీవి గతంలో ఓసారి థాయిలాండ్ లో యాడ్ చేసాం. అక్కడి నుంచి ఇద్దరం కలిసి ముంబై వచ్చాం. అప్పటికే రాత్రి అయ్యింది. ఉదయాన్నే చిరంజీవి విమానంలో వెళ్లాల్సి ఉంది. కాసేపు మాట్లాడుకున్నాం. ఇక ఆ తర్వాత చిరంజీవి నా కౌచ్ లోనే పడుకున్నారు. ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్లారు. ఇలా అక్కడ క్యాస్టింగ్ కౌచ్ జరిగింది అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు సల్మాన్ ఖాన్.  ఆరోజు మా మధ్య అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా గాడ్ ఫాదర్ చేశాము అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: