వి.వి.వినాయక్ సినీ కెరీర్ లో కొన్ని డిజాస్టర్లు ఉన్నా వినాయక్ పేరు పోగొట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు అఖిల్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.


45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 20 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అక్కినేని అఖిల్ ఈ సినిమాలో హీరోగా నటించగా వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.


ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన కోన వెంకట్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు ను వెల్లడించారు. నేను 100 సినిమాలు అనుకుంటే నా సక్సెస్ రేట్ 70 కంటే ఎక్కువని కోనవెంకట్ తెలిపారు. గల్లీ రౌడీ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిందని ఆయన అన్నారు. మన సక్సెస్ రేట్ ను బట్టి నమ్మకం ఏర్పడుతుందని కోన వెంకట్ కామెంట్లు చేశారట.


వినాయక్ తో అదుర్స్ సినిమాకు పని చేశానని కోన వెంకట్  కూడా తెలిపారు.


అఖిల్ మూవీ చేయవద్దని వినాయక్ కాళ్లు పట్టుకోవడం ఒకటే తక్కువ అని కోన వెంకట్ చెప్పుకొచ్చారట.. ఆ సినిమా కథలో ఏదో తేడా కొడుతుందని నేను చెప్పానని నేను చెప్పితే వినకపోవడంతో చాలామందితో చెప్పించానని కోన వెంకట్  కామెంట్లు కూడా చేశారు. బాబీతో కూడా నేను వినాయక్ కు చెప్పించానని కోన వెంకట్ పేర్కొన్నారు.

నా హార్ట్ కు క్లోజ్ అయిన వ్యక్తులలో వినాయక్ ఒకరు అని కోన వెంకట్ చెప్పుకొచ్చారట.. ప్రస్తుతం నేను నమ్మిన ప్రాజెక్ట్ లను నేను చేస్తున్నానని ఆయన అన్నారు. శ్రీనువైట్ల సినిమాలకు సూర్య కో డైరెక్టర్ అని జిన్నా సినిమాతో సూర్య దర్శకుడిగా పరిచయం కానున్నారని కోన వెంకట్ తెలిపారట.. జిన్నా సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కోన వెంకట్ నమ్మకాన్ని కలిగి ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: