ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ ఇచ్చింది శ్రీముఖి. చోళీ లెహంగా ధరించి సరికొత్త కోణంలో అందాల ప్రదర్శన చేసింది. ఇక శ్రీముఖి నడుము వంపులు చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారట.


దసరా పండగ వేళ శ్రీముఖి అలా తయారయ్యారు. పింక్ కలర్ చోళీ లెహంగా ఆమె అందాన్ని మరింత పెంచేసింది. పండగ శోభ మొత్తం శ్రీముఖి ముఖంలోనే ఉంది. శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.


 

ఇక శ్రీముఖి కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉందట.. ఆమె యాంకర్ గా జోరు చూపిస్తున్నారు. పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆహాలో ఇటీవల మొదలైన డాన్స్ ఐకాన్ యాంకర్ గా చేస్తున్నారు. ఈ షోలో శ్రీముఖి స్కిన్ షో తో హద్దులు దాటేస్తుంది.


 

శ్రీముఖి చాలా తక్కువ సమయంలో స్టార్ యాంకర్ హోదా పట్టేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షోతో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవితో కలిసి పటాస్ లో శ్రీముఖి తనదైన కామెడీ ను పంచారు.పటాస్ చెప్పుకోదగ్గ విజయం అందుకోగా శ్రీముఖి మెల్లగా నిలదొక్కుకున్నారు. గ్లామరస్ యాంకర్స్ కేటగిరీలో అనసూయ, రష్మీ తర్వాతి స్థానం శ్రీముఖిదే విష్ణుప్రియ, వర్షిణి లాంటి వాళ్ళు ఆమెకు పోటీ ఇచ్చినా కానీ నిలదొక్కుకోలేకపోయారు.


 

శ్రీముఖి హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో రాజా రవీంద్ర, భరణి, సింగర్ మను కీలక రోల్స్ చేశారు. అయితే ఈ మూవీ అనుకున్నంత గా విజయం సాధించలేదు.


 

అలాగే ఇట్స్ టైం టు పార్టీ మూవీలో శ్రీముఖి నటించారు. ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి రెండు మూడు చిత్రాల్లో ఆ తరహా పాత్రలు చేశారు. నితిన్ మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య పాత్రలో శ్రీముఖి కనిపించడం గమనార్హం 


 

నటిగా యాంకర్ గా మోడల్ గా శ్రీముఖి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉందట.అమ్మడు సంపాదన కూడా కోట్లలోనే. దీంతో శ్రీముఖి తరచుగా విందులు, విహారాలలో పాల్గొంటూ ఉంటారు. మిత్రులతో నచ్చిన ప్రదేశానికి చెక్కేస్తూ ఉంటారు.


 

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి తృటిలో కప్ మిస్ అయ్యారు. బిగ్ బాస్ ఫైనల్ లో సింగర్ రాహుల్ గంజ్ తో పోటీపడి రన్నర్ గా మిగిలారు. బిగ్ బాస్ షో ద్వారా శ్రీముఖి భారీగా ఆర్జించారు.టైటిల్ విన్నర్ కంటే శ్రీముఖి అధిక మొత్తంలో రాబట్టినట్లు సమాచారం. మరోవైపు బిజినెస్ ఉమన్ గా మరి ఒకటి రెండు వ్యాపారాలు కూడా చేస్తుంది. ప్రతి క్షణం కెరీర్ లో ఎదగాలనే ఆలోచనలు అయితే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: