స్టార్ డైరెక్టర్ సుకుమార్ టీమ్ నుండి డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట ఉప్పెన చిత్రంతో డైరెక్టర్ గా మారిన ఈ దర్శకుడు తన మొదటి చిత్రంతోనే గురువును మించిన శిష్యుడుగా పేరు సంపాదించారు. ఇక ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి అరుదైన రికార్డును అందుకుంది. ఒక సాధారణ ప్రేమ కథ గా తెరకెక్కించిన ఈ చిత్రం టేకింగ్ ,మ్యూజిక్ పరంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక తన ఫస్ట్ సినిమాతోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు ఇక ఆ తర్వాత తన మొదటి సినిమాని తెరకెక్కించిన బ్యానర్పై రెండవ సినిమాలను తెరకెక్కించాలని అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారట.


ఉప్పెన చిత్రం విడుదల ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ తన తదుపరి చిత్రాన్ని మాత్రం తెలుపలేదు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కథలో ఎన్టీఆర్ పాత్ర ప్రస్తుత కాలంలో 60 ఏళ్ల వృద్ధుడిగా ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా ఇలా రెండు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా వృద్ధుడి పాత్ర వీల్ చైర్కే పరిమితం అవుతుందని అలాంటి పాత్రలు ఎన్టీఆర్ నటించడం ఇష్టం లేక ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టినట్లుగా సమాచారం.

ఇక ఇదే కథ అని ఆ తర్వాత మరొక హీరోకి వినిపించగా అది కూడా వర్కౌట్ కాలేదని ఆ హీరో తిరస్కరించినట్లు సమాచారం  అయితే బుచ్చిబాబు మాత్రం తన గురువు సుకుమార్ ద్వారా మెగా ఫ్యామిలీతో మరొక హీరోతో ఈ సినిమాని చేయడానికి పట్టాహాసంగా పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక అది కూడా వర్కౌట్ కాకపోతే బుచ్చిబాబు ఆశించిన స్థాయిలో హీరోలను ఆకట్టుకోలేకపోతున్నాడని వార్తలు వినిపించడం ఖాయమని భావిస్తున్నారు సినీ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: