తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీvలో కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే విశాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పందెం కోడి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు.  ఇది ఇలా ఉంటే విశాల్ హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పటి కప్పుడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ మరి కొన్ని రోజుల్లో లోకేష్ కానకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ లో విలన్ పాత్రలో విశాల్ కనిపించబోతున్నట్లు , విశాల్ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే దళపతి విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది. ఇలా మాస్టర్ మూవీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: