ప్రస్తుతం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఇంకా అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కాంట్రవర్సీ లు రేపుతున్న చిత్రం 'వారసుడు'. తమిళ బిగ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో వారసుడుగా తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.ఈ సినిమా విడుదలకు ముందే బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అనేది చివరి దశకు వస్తుండగా మేకర్స్ అయితే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సినిమా నుంచి చాలా లీక్స్ కూడా బయటకి వస్తుండటం చాలా షాకింగ్ కి గురి చేస్తుంది. ఎంత జాగ్రత్త పడ్డా కూడా సీన్స్ అనేవి లీకవుతున్నాయి.ఆ మధ్య కూడా చాలానే బయటకి వచ్చినా ఈసారి కూడా కొన్ని సీన్స్ బయటకి వచ్చేసినట్టు సమాచారం తెలుస్తుంది. 


 ఇది అంతా కూడా ఓ మైనింగ్ సెటప్ లో కనిపిస్తుండగా చాలా బైక్స్ తో ఈ షాట్ అనేది 2కనిపిస్తుంది. సాంగ్ బీట్ కి తగ్గట్టుగా హీరోతో సహా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వారు అంతా సాంగ్ లో ముందు సాగడం కనిపిస్తుంది.ఇది చూడటానికి అచ్చం kgf సీన్ లా అనిపిస్తుంది. వంశీ పైడిపల్లి kgf ని కాపీ కొడుతున్నాడా అన్న సందేహం కలుగుతుంది.అయితే ఈ సీన్ ఖచ్చితంగా వారిసు సినిమా లోనిదే అని చెప్పడానికి లేదు కానీ చూడటానికి కొత్తగా ఉంది కాబట్టి విజయ్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇంకా అలాగే సోషల్ మీడియా నుంచి కూడా ఇది తొలగించనున్నట్టుగా సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మహేష్ బాబు ఫ్రెండ్  మహర్షి డైరెక్టర్  వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్  చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్  కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: