చిత్ర పరిశ్రమకు పటాస్ సినిమా ద్వారా పరిచయమయ్యి వరస సినిమాలకు దర్శకత్వం వహిస్తూ అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు పొందారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.అయితే ఇప్పటివరకు ఈయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అనేది జరగలేదు.ఇక  ఇలావరుస హిట్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే బాలకృష్ణ సినిమాతో బిజీ కానున్నారు. ఇదిలావుంటే తాజాగా f3 సినిమాతో మంచి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం బాలకృష్ణతో చేయడానికి అన్ని పనులను సిద్ధం చేస్తున్నారు.

అంతేకాదు ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో తనను కావాలని కొందరు టార్గెట్ చేసి తన పట్ల నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావిపూడి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇండస్ట్రీలో కొందరు పని కట్టుకొని తన సినిమాని కొనుగోలు చేసిన బయర్లు పెద్ద ఎత్తున నష్టపోయారంటూ వార్తలు సృష్టిస్తున్నారు.కాగా ఇప్పటివరకు తాను దర్శకత్వం వహించిన ఏ సినిమా ద్వారా కూడా నిర్మాతలకు

 బయ్యర్లకు ఎలాంటి నష్టం రాలేదని అయితే వరుస హిట్ సినిమాలను అందుకోవటం వల్లే తన గురించి కొందరు జలసిగా ఫీల్ అయ్యి ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారంటూ ఈ సందర్భంగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తనకు ఎప్పటికీ కామెడీ జోనర్ అంటేనే ఇష్టమని అయితే మొదటిసారి బాలయ్య కోసం తన జానర్ కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందంటూ అనిల్ రావిపూడి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలతో ఈయనని ఇండస్ట్రీలో టార్గెట్ చేస్తున్నది ఎవరు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: