సాధారణంగా సంక్రాంతి పండుగకు మూడు రోజులు సెలవులు ఇస్తున్న నేపథ్యంలో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ మూడు రోజులలో సినిమా బాగుంటే భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో మేకర్స్ కూడా ఉంటారు. ఈ క్రమంలోని ఈసారి సంక్రాంతి పండుగ సౌత్ సినిమాలకు కలిసొచ్చేలా ఉంది. ముఖ్యంగా మన ఇండియాలో పోల్చుకుంటే యూఎస్ఏ లో సౌత్ సినిమాలకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య,  మరొకవైపు నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలతో పాటు తమిళ్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న వారిసు చిత్రంతో పాటు తునివు సినిమా కూడా సంక్రాంతి పండుగకు పోటీపడుతున్న విషయం తెలిసిందే . అయితే తమిళ్ సినిమాలు తెలుగులో.. తెలుగు సినిమాలు తమిళ్ లో విడుదలవుతాయా?  అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ..యూఎస్ఏ లో ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నట్లు సమాచారం.

ఇకపోతే సంక్రాంతికి జనవరి 14 , జనవరి 15 సెలవు దినాలు కాగా యూఎస్ఏ లో జనవరి 16వ తేదీ సోమవారం కూడా సెలవు కావడం తో  సౌత్ సినిమాలకు కలిసొచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే జనవరి 16వ తేదీన..మార్టిన్ లూథర్ కింగ్ డే. కావడం చేత యూఎస్ఏ లో అధికారిక సెలవు దినం ప్రకటించారు . దీంతో ఈ నాలుగు సినిమాలు మూడు రోజులపాటు హౌస్ ఫుల్ థియేటర్లతో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  మరి నాలుగు సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఏ సినిమా నెగ్గుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: