ఇటీవల `మేజర్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్‌(Adivi Sesh).. ఇప్పుడు `హిట్ 2` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన `హిట్‌` మంచి విజయం అయితే సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా `హిట్ 2`ను రూపొందించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా అయితే నటించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని న్యాచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.

భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న ఈ చిత్రం గ్రాండ్ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అడివి శేష్ కూడా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ కు ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్న అయితే ఎదురైంది. అదేంటంటే.. ఇటీవల అడివి శేష్ శర్వానంద్ తో కలిసి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే(unstoppable with nbk) సీజన్ 2లో పాల్గొన్న సంగతి విధితమే.

ఈ టాక్ షోకు నటసింహం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అడివి శేష్‌, శర్వాలతో బాలయ్య తెగ సందడి చేశాడు. అయితే ఈ షోలో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా బాలయ్య.. `ఈమెతో మాత్రం కిస్ వద్దురా బాబు అనుకున్న హీరోయిన్ ఎవరు?`అని అడివి శేష్ ను ప్రశ్నించగా.. టక్కున ఆయన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరును చెప్పేశారటా.

అయినా ఈ టాప్ హీరోయిన్‌తో ముద్దు వద్దని అంత బలంగా శేష్ ఎందుకు ఫిక్సయ్యాడో ఏంటో తెలుసుకునేందుకు.. తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ప్రయత్నించిందటా.. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డేతో ముద్దు ఎందుకు వద్దన్నారు అంటూ శేష్‌ను ప్రశ్నించింది. ఆయన ఆయన బదులిస్తూ.. `ఆ రోజు బాలయ్య గారు అడిగారు.. ఏదో ఒక సమాధానం చెప్పాలి.. అందుకే పూజా హెగ్డే(pooja hegde) పేరు అయితే చెప్పేశాను. అంతకు మించి ఎటువంటి కారణం అయితే లేదు` అంటూ చెప్పుకొచ్చాడు.. దీంతో శేష్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: