షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ కి దర్శకత్వం వహించి , దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే నేషనల్ అవార్డ్ ను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారిపోయిన తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ "పెళ్లి చూపులు" మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోని , ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించాడు. అందులో భాగంగా తరుణ్ భాస్కర్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తరుణ్ భాస్కర్ "కీడ కోలా" అనే మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. వీజి సైన్మా, క్విక్ ఫాక్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న కీడా కోలా ను వ‌చ్చే ఏడాది విడ‌దుల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయినట్లు , రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ఈ రోజు నుండి ప్రారంభించ బోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: