తాజాగా నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్న హారర్ చిత్రం కనెక్ట్. అయితే ఈ సినిమాను తమిళ్ నుంచి తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సోమవారం తెలుగు టీజర్ ను రిలీజ్ చేయగా తెలుగులో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. నయనతార కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రం కనెక్ట్ తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ కాబోతోంది.అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  తెలుగులో యూవి క్రియేషన్ సంస్థ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే సోమవారం తెలుగు టీజర్ ను రిలీజ్ చేయగా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  హారర్ అంశాలతో భయపడుతూ సాగే ఈ టీజర్ లో సత్యరాజ్,  అనుపమ్ ఖేర్  మాత్రమే కనిపించారు. అయితే నయనతారను చూపించలేదు. అవుట్ అండ్ అవుట్ హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. లాక్ డౌన్ టైం లో సాగే కథ ఇది అని సమాచారం. అయితే ఇందులో తల్లి పాత్రలో నయనతార మనకు కనిపించబోతున్నారు.సినీ చరిత్రలోనే మొదటిసారి బ్రేక్ లేకుండా ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.

ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా కనెక్ట్ సినిమాను 99 నిమిషాల నిడివి తో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కలెక్ట్ సినిమాను తమిళంలో నయనతార భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత అనుపమ్ ఖేర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్ ఇప్పుడు తమిళ్ లో కనెక్ట్ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఇప్పటికే నయనతార తో అశ్విన్ శరవణన్ మాయ సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హారర్ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: