మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రవితేజ ఆ తర్వాత తన టాలెంట్ తో హీరో గా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు సినిమా లలో హీరో గా నటిస్తూ ఉండగా ,  మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రవితేజ "ధమాకా" అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రవితేజ ,  కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో కూడా ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇలా వరుస మూవీ కమిట్మెంట్ లతో ఉన్న రవితేజ మరో దర్శకుడి మూవీ కి గ్రీన్ కూడా సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు సంపత్ నంది. రవితేజ మరియు సంపత్ నంది కాంబినేషన్ లో ఇది వరకే బెంగాల్ టైగర్ మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించింది. సంపత్ నంది కొన్ని రోజుల క్రితమే రవితేజ కు ఒక కథను వినిపించినట్లు , ఆ కథను రవితేజ ఓకే చేసినట్లు ,  మరి కొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: