రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో  ప్రాజెక్ట్ కె కూడా ఒకటి..ఈ సినిమాను 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్..భారీ యాక్షన్ తో ఈ సినిమాగా రాబొతుంది..ఈ సినిమా పై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్..ఈ సినిమా పై ఒక అప్డేట్ ను అందించారు..

సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కేవలం ఒక షెడ్యూల్ షూట్ అయింది అని, చేయి మాత్రమే కనిపించే ఓ రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ K గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి కావాల్సిన వెహికల్స్ దొరకవు, సొంతంగా తయారు చేసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు తగ్గట్టే మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సాయం అడగగా ఆయన ఓకే చెప్పడంతో సినిమా కోసం కొత్త తరహా వెహికల్స్ ని తయారు చేస్తున్నారు మహీంద్రా టీంతో కలిసి..ఇది ఫ్యాన్స్ కు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది..


ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను న్యూయర్ సర్ ప్రైజ్ గా వదిలారు.. న్యూ ఇయర్ స్పెషల్ అంటూ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈవీడియోలో ప్రాజెక్ట్ K సినిమాలో వాడే స్పెషల్ వెహికల్స్ కి వాడే ఓ సింగిల్ టైర్ మేకింగ్ వీడియో మాత్రమే చూపించారు. అలాగే ఆ టైర్ ని ఎలా తయారు చేశారు, టైర్ తయారు చేసే గ్యారేజ్ చూపించారు. ఎంతో ఆతృతగా వీడియో ఓపెన్ చేసిన అభిమానులు టైర్ తయారు చేయడం ఒక్కటి చూపించి మేకింగ్ వీడియో అంటారా కొంచమైన బుద్ది ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క టైర్ కే ఇంత కష్టపడి తయారు చేస్తున్నారంటే..ఇక సినిమా ఏ లెవల్ లో ఉంటుందో..అంటూ కామెంట్లు చేస్తున్నారు...సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: