నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఇకపోతే మొన్నటి వరకు అడపా దడపా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాణ బాధ్యతలు మాత్రమే చేపట్టిన కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసార సినిమాతో మళ్లీ థియేటర్లలోకి వచ్చి కమర్షియల్ హిట్ సాధించాడు. కొత్త డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ అందించింది అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందివ్వడమే కాకుండా కళ్యాణ్ రామ్ కి లాభాలను కూడా అందించింది . ఆయన నిర్మాణంలోనే తెరకెక్కిన ఈ సినిమా ఒకపక్క సక్సెస్ ను మరొక పక్క లాభాన్ని అందించడం గమనార్హం.

ఇకపోతే బింబిసారా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు కళ్యాణ్ రామ్ . ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ : బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ మూవీ సెట్ పై ఉండగానే మరో సినిమాను విడుదల కు సిద్ధం చేస్తున్నాడు.  ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన మరొక చిత్రం అమిగోస్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. కళ్యాణ్ రామ్.  ఇందులో పారిశ్రామికవేత్త సిద్ధార్థగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ లో తెలియజేయడం జరిగింది.


అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసింది చిత్ర బృందం.  రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.  సంక్రాంతికి ట్రైలర్ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది . మొత్తానికైతే ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరొక సినిమాను విడుదల చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు కళ్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: