ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్... కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా ప్రారంభం కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు.  కొరటాల శివ కూడా అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదా వేస్తూ అభిమానులకు మరింత చిరాకు కలిగిస్తున్నాడు.  కానీ ఎట్టకేలకు సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అంటూ అధికారికంగా ఒక ప్రకటన రివీల్ చేయడం జరిగింది.

ఫిబ్రవరి నెలలో కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాను ఫిబ్రవరి రెండవ వారం నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.  మరొకవైపు దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమా మినహా అంతకుముందు సినిమాలన్నీ కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నవే కాబట్టి ఎన్టీఆర్ తో ఆరంభం ఎలా ఉంటుంది?  మొదటి సన్నివేశాన్ని ఎలా చేయబోతున్నారు? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాదు శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో ఎన్టీఆర్ పై కొన్ని కీలక యాక్షన్స్ సన్నివేశాలను ఫిబ్రవరి రెండవ వారం నుంచి చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.  ప్రస్తుతం అందుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు కూడా సిద్ధం అయ్యాయి. మొదటి షెడ్యూల్ ను దాదాపుగా రెండు వారాలపాటు నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.  అంతేకాదు అనుకున్న సన్నివేశాలను ముందుగానే ముగించే అవకాశాలు కూడా లేకపోలేదు అని స్పష్టం అవుతుంది. మార్చిలో జరిగే షూటింగ్ కి హీరోయిన్ హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కి  ఎలాంటి క్రేజ్ అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: