తెలుగు సినీ పరిశ్రమకు నందమూరి తారక రామారావు... అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ కూడా రెండు కళ్ళుగా చెబుతూ ఉంటారు. అలాంటి ఇద్దరు నటుల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు గానే మెలిగారు. ఎన్టీఆర్ సినీ రంగంలో కొనసాగినంత వరకు కూడా వీరిద్దరూ మంచి మిత్రులు గానే మెలిగారు. అంతేకాదు ఆర్థికంగా ఏదైనా సలహాలు కావాలి అంటే అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఎన్టీఆర్ సలహాలు తీసుకునేవారు. అంతలా వీరిద్దరి మధ్య మంచి సన్నిహితం ఉండేది. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్ పిల్లల మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఉండేది.

ఇకపోతే అందరూ సన్నిహితంగానే ఉండేవారు.  కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటినుంచి ఏఎన్ఆర్ తో చెడింది.  అయితే ఈ విషయాన్ని ఏఎన్ఆర్ కూడా బహిరంగంగానే ఒప్పుకోవడం జరిగింది.. అయితే ఆ గొడవ ఎలా ఉన్నప్పటికీ బాలయ్య ఒక దశ వరకు ఏఎన్ఆర్ తో అలాగే.. ఆయన కుటుంబ సభ్యులతో చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఏఎన్నార్ ఆయన తనయుడు నాగార్జునతో బాలయ్యకు కూడా దూరం పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఆ దూరం ఎంత అంటే అక్కినేని మరణించినప్పుడు కూడా చివరి చూపు చూడడానికి బాలయ్య రాలేదు. కనీసం సంతాప సందేశం కూడా అందించలేదు.

చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య రాలేదు అంటే అంతగా వారి మధ్య ఏ గొడవ జరిగింది? అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా బాలయ్య వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలో "అక్కినేని తొక్కినేని" అనే మాట అనడంతో మరొకసారి అక్కినేని ఫ్యామిలీతో బాలయ్య కుటుంబానికి విభేదాలు ఉన్నాయనే చర్చ మొదలయ్యింది. మరి ఈ రెండు కుటుంబాల మధ్య వచ్చిన గొడవలకు కారణం ఎవరు? అసలు ఏం జరిగింది? అనేది ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: