బాహుబలి సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇక ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా కూడా అదే బడ్జెట్తో అదే రేంజ్ అంచనాలతో తెరకెక్కుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా తర్వాత రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఈ సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఇక ప్రభాస్ తర్వాత ప్రాజెక్టులపైనే అభిమానులు మొత్తం భారీ ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఎంతోమంది దర్శకులతో అరడజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.


 అయితే ఇక తన దగ్గరికి వచ్చిన కొత్త కథలను వింటూ కథ నచ్చితే ఓకే చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరిన్ని కొత్త కాంబినేషన్స్ కు ప్రభాస్  సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ప్రభాస్ ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు అంటూ ఒక టాక్ తెరమీదికి వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న హృతిక్ రోషన్ తో కలిసి ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమా కోసం చర్చలు జరిపిందట.


 హృతిక్ హీరోగా నటించిన వార్ సినిమాకు దర్శకుడిగా పనిచేసిన సిద్ధార్థ ఆనంద్  దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందట. ఈ క్రమంలోనే ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్ కేవలం ఒక గాసిప్ మాత్రమే కాదు ఇది నిజమే అన్న వార్త ఒకటి బయటికి వచ్చి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరో కృతిక్ రోషన్ కాగా ప్రభాస్ కేవలం గెస్ట్ పాత్రలోనే కనిపించబోతాడట. 20 నిమిషాల పాటు ప్రభాస్ పాత్ర ఉంటుందట. ఏది ఏమైనా ఇక ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూడాలని అభిమానులు కూడా ఆశ పడుతున్నారని చెప్పాలి. ఇక ఈ కాంబినేషన్ పై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: