నందమూరి నట వంశానికి పెద్దదిక్కు ప్రస్తుతం బాలకృష్ణ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బాలకృష్ణ. ఇందుకుగాను బాలయ్య మాటను వారి కుటుంబంలో ఎవరు కూడా జవదాటరు.ఆయన పిల్లలే కాదు ఆయన అన్నదమ్ముల పిల్లలు సైతం బాలయ్య మాటకి నో చెప్పరు. వీరి తరువాతి తరం హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న సైతం బాలకృష్ణ అంటే ఎంతో అభిమానాన్ని చూపుతారు. బాలయ్య కి సంబంధించిన ఏ వేడుకల్లో అయినా ఈ హీరోలు ముందుంటారు. స్టార్ హీరోలైనప్పటికీ ఒక్కసారైనా తమ బాబాయ్ తో కలిసి నటించాలి అని ఆశ పడుతూ ఉంటారు

 ఈ యంగ్ హీరోలు.అయితే అందరికన్నా ముందుగా బాలయ్యతో కలిసి నటించిన కళ్యాణ్ రామ్  మొదట బాల నటుడిగా తెరపై బాలకృష్ణ నటించిన బాల గోపాలుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాని అనంతరం ఎన్టీఆర్ బయోపిక్ గా రూపొందిన కథానాయకుడు మహా నాయకుడు వంటి సినిమాల్లో సైతం బాలకృష్ణతో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఆది విజయోత్సవంలో కూడా నటించాడు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో బాబాయ్ తో కలిసి కనీసం ఒక సినిమాలో అయినా నటించాలి అని ఉంది అంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక తారకరత్న మొదటి నుండి బాలయ్య సినిమాలో కనిపించాలని ఆశిస్తూ ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం లో ఆయన తరఫున ప్రచారం కూడా నిర్వహించాడు తారకరత్న. ఈ నేపథ్యంలోనే తారకరత్న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి తారకరత్నకు నటించాలని ఉంది అన్న అంశం తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోయే సినిమాలో తారకరత్న ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తాడు అని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విలన్ గా కాదు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనాప్పటికీ బాలకృష్ణతో కలిసి తారకరత్న నటించాలని ఎప్పటినుండో కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిపోతుంది అని నందమూరి అభిమానులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: