రాజావారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయమైన యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో వెండి తెరకు పరిచయం అయిన మొదటి మూవీ తోనే పర్వాలేదు అనే రేంజ్ ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఏకంగా ఈ యువ హీరో మూడు మూవీ లలో హీరో గా నటించాడు. ఆ మూవీ లు పెద్దగా విజయాలను సాధించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ ... మురళీ కిషోర్ అబ్బోరు దర్శకత్వంలో రూపొందినటు వంటి వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. 

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ఫిబ్రవరి 7 వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: