టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోల్లో నాని ఒకరు. నాని ఇప్పటికే ఎన్నో సినిమాలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నాని తాజాగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని  ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు ... పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన హక్కులను అమ్మి వేసే పనులు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క కర్ణాటక రైట్స్ కోసం పోటీ భారీ లెవెల్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కుల కోసం కర్ణాటక ఏరియాలో చాలా మంది పోటీపడుతున్నట్లు కేజీఎఫ్ నిర్మాతలు ఈ మూవీ హక్కులను దక్కించుకోవడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా దసరా మూవీ హక్కుల కోసం కర్ణాటక ఏరియాలో పోటీ భారీగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: