సాధారణంగా డిజాస్టర్ గా నిలిచిన సినిమాలను చూసేందుకు పెద్దగా ప్రేక్షకులు ఆసక్తి చూపించరు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి డిజాస్టర్ సినిమాలు అటు టీవీలో వస్తున్న కూడా ఈ సినిమా ఏం చూస్తాం లే అనుకొని ఛానల్ మార్చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఒకప్పుడు డిజాస్టర్ గా నిలిచిన సినిమాకే ఊహించని రీతిలో ప్రస్తుతం ప్రేక్షకాదరణ లభిస్తుంది అని చెప్పాలి. ఇంతకీ ఆ డిజాస్టర్ ఏదో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ. అయితే ఇప్పటికి కొంత మంది ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్న దానిపై క్లారిటీ లేదు అని చెప్పాలి.


 అయితే ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాత నాగబాబుకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అయితే ఈ ఫ్లాప్ సినిమాను ఇటీవల భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే ఒకప్పటి డిజాస్టర్ సినిమాకు ఇప్పుడు వస్తున్న క్రేజ్ చూసి సోషల్ మీడియా షాక్ అవుతుంది. ఆరెంజ్ సినిమాను ఎన్ని థియేటర్లో వేస్తే అన్ని థియేటర్లు అన్ని షోలు కూడా ఫుల్ అవుతున్నాయి. హైదరాబాద్ ఏరియాలో మొత్తంగా 54 షోలు వేశారు 41 షోలు ఫుల్ అయ్యాయి అని చెప్పాలి. విజయవాడలో పది షోలు వేస్తే 8 షోలు హౌస్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు ఏరియాలో 12 షోలు వేస్తే 8 షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయ్. వైజాగ్ ఏరియాలో 12 వేస్తే 11 ఫుల్ అయ్యాయి. ఇక ఇలా రామ్ చరణ్ ఫాన్స్ అందరు కూడా ఆరెంజ్ మేనియాలో మునిగి తేలుతున్నారు అని తెలుస్తుంది. ఇక చరణ్ అభిమానులు అందరూ ఇంకా ఎక్కువ షోలు వెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇక ఆరంజ్ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బులు అన్నింటినీ కూడా తాను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తాను అంటూ నాగబాబు ప్రకటించారు. ఏది ఏమైనా ఒకప్పుడు ఆ భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన ఆరెంజ్ సినిమా ఇక ఇప్పుడు మాత్రం థియేటర్లలో సత్తా చాటుతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: