బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాత లలో ఒకరు అయినటు వంటి కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కరణ్ జోహార్ ఇప్పటికే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమా లను నిర్మించాడు. అందులో ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి .

ఇలా ప్రొడ్యూసర్ గా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న కరణ్ "కాఫీ విత్ కరణ్" అనే పేరుతో ఒక టాప్ షో ను నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగం గా ఇప్పటికే ఈ టాక్ షో కి సంబంధించిన 7 సీజన్ లు కూడా విజయ వంతంగా పూర్తి అయ్యాయి . మరి కొన్ని రోజు ల్లోనే ఈ టాక్ షో కి సంబంధించిన 8 వ సీజన్ ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది .

ఈ టాక్ షో 8 వ సీజన్ ఈ సంవత్సరం ఆగస్టు లేదా నవంబర్ నెల లో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ టాక్  షో కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ... మరి కొన్ని  ప్రారంభం కానున్న కాఫీ విత్ కరణ్ షో 8 వ సీజన్ కు సౌత్ ఇండియా లో సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో లు అయినటు వంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ... యాష్ ... రోషబ్ శెట్టి ముఖ్య అతిథులుగా విచ్చేయునున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: