యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో  30 వ మూవీ గా రూపొందుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రాత్రి వేళ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ముగిసిన తర్వాత ఈ చిత్ర బృందం గోవా లో ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 గోవా షెడ్యూల్ లో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటిస్తున్న వారిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ గోవా షెడ్యూల్ ను చాలా రోజుల పాటు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ... ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీ తో జాన్వీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మూవీ కనుక మంచి విజయం  సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు చాలా మంది పని చేయనున్నారు. అలాగే ఇండియాలో ఉన్న అత్యంత క్రేజ్ కలిగిన నటీ నటులు ఈ మూవీ లో కనిపించబోతున్నారు. ఇది.వరకే ఎన్టీఆర్ ... కొరటాల శివ కాంబినేషన్.లో జనతా గ్యారేజ్ మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. అలా వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందడంతో ప్రస్తుతం విరి కంబో లో రూపొందుతున్న మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: