ప్రియదర్శి.. ఒకప్పుడు కమెడియన్ గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అద్భుతమైన కామెడీ పండించ గలడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించ గలడు అనే విషయం  ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియదర్శిలో ఎలాంటి పాత్రలో నైనా ఒదిగి పోయే నటుడు ఉన్నాడు అన్నది మాత్రం ఇటీవల కాలంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఎన్నో వైవిధ్యమైన కథల  తో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు ప్రియదర్శి.


 గతంలో మల్లేశం అనే సినిమా తో విజయాన్ని సాధించిన ప్రియదర్శి ఇక ఇటీవల  బలగం సినిమా తో సెన్సేషన్ సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో తన నటన తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. సాధారణం గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిందంటే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అందరి బాట లోనే అటు ప్రియదర్శి కూడా తన పారితోషకాన్ని పెంచేశాడు అన్నది మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోయింది. ఏకంగా హీరోగా ప్రియదర్శిని తీసుకోవాలి అంటే మాత్రం రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ చెల్లించాల్సిందేనట.



 అయితే ఇంత పెద్ద మొత్తం అటు ప్రియదర్శి మార్కెట్కు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. ప్రస్తుతం అతనికి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇక రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే బలగం సినిమా తర్వాత ఎలాంటి పాత్రలో నటించిన ప్రియదర్శి పూర్తిస్థాయి న్యాయం చేస్తాడని ఇటీవల కాలంలో ఎంతోమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఎవరైనా కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు అంటే చాలు వారికి మొదటి ఆప్షన్ గా ఇప్పుడు ప్రియదర్శి మారిపోయాడు అని చెప్పాలి. ఇలాంటి టాలెంట్ ఉన్న నటులు ఇండస్ట్రీకి మరికొంతమంది అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: