ఈ నెలాఖరుకు విడుదలకాబోతున్న అఖిల్ సినిమా ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణంగా స్పై థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమా కథలు ఒకే తీరుగా ఉంటాయి. ఆ కథలతో తీసిన సినిమాలలో హై ఒల్టేజ్ యాక్షన్ సీన్స్ చాల ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సినిమాలలో కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని సూపర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి.


ఈసంవత్సరం జనవరిలో వచ్చిన షారూఖాన్ ‘పఠాన్’ మూవీ 1000 కోట్ల సినిమాగా సంచలనాలు సృష్టించింది. ఇండియన్ రా ఏజెంట్ గా పనిచేసి తన భార్య చావు కారణంగా మాఫియా కింగ్ గా మారిపోయి విద్వంసం చేసే మాజీ రా ఏజంట్ ను షారూఖ్ ఎలా పట్టుకున్నాడు అన్న కథను దేశభక్తితో మిళితం చేసి చెప్పారు. ఆపాయింట్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.


ఇక ‘ఏజెంట్’ మూవీలో కూడ అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తాడు. అఖిల్ పాత్రను చాల డిఫరెంట్ గా సురేంద్ర రెడ్డి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీలో అఖిల్ పాత్ర డ్రగ్స్ మాఫియా పై యుద్ధం చేస్తుంది. అక్కడ కూడ కొన్ని దేశభక్తికి సంబంధించిన సీన్స్ ను దర్శకుడు సురేంద్ర రెడ్డి రచయిత వక్కంతం వంశీ తెలివిగా స్క్రీన్ ప్లే లో ఇమిడిచారు అని టాక్.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘రేసుగుర్రం’ సినిమా వచ్చింది. ఆమూవీ అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని సురేంద్ర రెడ్డి చాల నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో సగటు ప్రేక్షకుడు ‘ఏజెంట్’ ను ‘పఠాన్’ తో పోలికపెట్టి చూస్తే మటుకు ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అఖిల్ కెరియర్ కు సంబంధించి అత్యంత భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈమూవీ విజయం అఖిల్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: