తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ తాజాగా రామబాణం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి మిక్కీ జై మేయర్ సంగీతం అందించగా ... డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా నిన్న అనగా మే 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 46 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ ఏరియాలో 21 లక్షలు , యూఏ లో 14 లక్షలు , ఈస్టులో 9 లక్షలు , వెస్టులో 6 లక్షలు , గుంటూరు లో 8 లక్షలు , కృష్ణ లో 8 లక్షలు , నెల్లూరులో 5 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తం గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.17 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 10 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.27 కోట్ల షేర్ ... 2.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: