అయితే ఆదిపురుష్ ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టర్లు, టీజర్లు చూసి కొంత మంది విమర్శలు చేశారు. గ్రాఫిక్స్ బాలేదని, ప్రభాస్ గెటప్ బాలేదని, సినిమా ఆడదని రకరకాల కామెంట్స్ చేశారు. ఎట్టకేలకు ఈ విమర్శలను దాటుకుని సినిమా విడుదలైంది. మరి టాక్ ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏం చెబుతున్నారు? సోషల్ మీడియా రివ్యూలో చూద్దాం. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి పాలాభిషేకాలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారు.సోషల్ మీడియా లో ఆదిపురుష్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉందని చెబుతున్నారు. హనుమాన్ సన్నివేశాలు చాలా బాగున్నాయని, సంగీతం, పాటలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ బాలేదని, సెకండాఫ్ లో ఎమోషనల్ కనెక్షన్ అంతగా లేదని అంటున్నారు. ఓవరాల్ గా డీసెంట్ మూవీ అని, చూడవచ్చునని ఒక యూజర్ రివ్యూ ఇచ్చారు. చాలా బాగుంది, గూస్ బంప్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇది సులువుగా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. ప్రభాస్ హిట్ కొట్టేశారు అంటూ ఒక యూజర్ రివ్యూ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని, విజువల్స్, గ్రాఫిక్స్, ఫైట్ సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయని, ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ల పాత్రలు అద్భుతం అంటూ మరొక యూజర్ రివ్యూ ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి