ఇకపోతే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి తమ వారసులను హీరోగా లేదా హీరోయిన్గా పరిచయం చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ కమెడియన్ సుధాకర్ మాత్రం తన కొడుకుని హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెబుతున్నాడు. తన కొడుకు బెన్నీ త్వరలోనే ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెడతారని చెప్పి షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు విషయంలోకి వెళితే ఇప్పుడే తన కొడుకు నటనలో పూర్తి శిక్షణ తీసుకున్నారని.. ఇక హీరోగా అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారని.. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే ఎక్కువ సినిమాలలో అవకాశాలు వస్తాయని అప్పుడు తన కొడుకు తనలాగే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని సుధాకర్ తెలిపారు.
హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదంటే కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని.. ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మరొకవైపు ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఒక షో కి హాజరయ్యి ఎన్నో విషయాలను అందులో పంచుకున్నారు. ఇకపోతే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుధాకర్ ను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి