టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో కలచివేస్తోంది. అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన శ్యామ్ మరణంపై విచారణ జరపాలని అనేక రకాల డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ఆ శ్యామ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి మిగతా అభిమానులు కూడా ముందుకు వచ్చారు. అతని చెల్లెలి బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు వారు చెప్పారు.మంగళవారం (జూన్ 27) శ్యామ్ మరణం తర్వాత సోషల్ మీడియాలో #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్‌ట్యాగ్ ను ఫ్యాన్స్ ట్రెండింగ్ లో ఉంచారు. అటు ఎన్టీఆర్ కూడా శ్యామ్ మరణ వార్తపై స్పందించాడు. అతని మరణానికి సానుభూతి తెలుపుతూనే దీనిపై విచారణ జరపాలని కూడా ఎన్టీఆర్ అధికారులని డిమాండ్ చేశాడు.ఇక తాజాగా శ్యామ్ మరణంపై అభిమానులు ఓ నోట్ ని రిలీజ్ చేశారు. "పోయిన శ్యామ్ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము.


కానీ శ్యామ్ కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మేము మాట్లాడాము. వాళ్లకి అన్ని విధాలుగా మేము ధైర్యాన్ని ఇచ్చాము. ఇక శ్యామ్ తన కుటుంబానికి వెన్నెముకలాంటోడు.శ్యామ్ లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేనిది. అందువల్ల శ్యామ్ చెల్లి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాము. ఇంకా అలాగే జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాము" అని ఎన్టీఆర్ అభిమానులు ఆ నోట్ లో పేర్కొన్నారు.RAW ntr పేరు ఉన్న ఓ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ నోట్ అనేది వెలువడింది. ఇంకా ఇతరుల నుంచి విరాళాలు కూడా వీళ్లు సేకరించడానికి నిరాకరించారు. ఆ కుటుంబ బాధ్యత మొత్తం తమదే అని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తోపాటు ఏపీలోని పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా శ్యామ్ అనుమానాస్పద మరణంపై విచారణ జరగాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: