తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లే దు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి వాటిలో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపును సంపాదిం చుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొం టున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ నటుడు రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి పవన్ బాసంసెట్టి దర్శకత్వం వహించగా ... సుధాకర్ చేరుకురి ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ తో నాగ శౌర్య ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: