
తన అన్నయ్య గురించి ఎవరైనా సరే ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే కచ్చితంగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఈ రోజున చిరంజీవి బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
ఈ పోస్ట్ విషయానికి వస్తే.." అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టం కలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తున్న మహా నదిగా మారినట్టు మీ పయనం నాకు చాలా గోచరిస్తూ ఉంటుంది.. మీరు ఎదిగిన తీరు ఎదగడానికి సహాయపడిన మార్గం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది మీ సంకల్పం పట్టుదల శ్రమ నిజాయితీ ఎందరికో ఆదర్శం ఎంతోమంది అభిమానులను సంపాదించ గర్వం అనేది కనిపించకుండా మిమ్మల్ని మీరు మరుచుకున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయనికం అంటూ తెలియజేశారు ఆనందం ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.